AP: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, మురసు తుఫాన్ ప్రభావంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల రక్షణ, పునరుద్ధరణ చర్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు తగ్గే వరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. సుమారు 15 జిల్లాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉందని, రాబోయే 2, 3 రోజులు అత్యంత కీలకమని, ప్రజలు, అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.