రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి (వీడియో)

AP: పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజపాలెం మండలం పెద్దనెమలిపురి గ్రామం వద్ద ట్యాంకర్ అదుపుతప్పి కారుపై పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ నూరుల్లా, షేక్ హబీబుల్లా, షేక్ నజీమాగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్