ఏపీని ఇప్పటికే వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో NTR, కృష్ణా, గుంటూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొన్నారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూ.గో, కోనసీమ, కాకినాడ, యానాం, ఏలూరు, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.