AP: కర్నూల్ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చిన యువకులు తుంగభద్రలో స్నానాలకు వెళ్లి గల్లంతయ్యారు. వీరు కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాకు చెందిన ప్రమోద్, సచిన్, అజిత్ అని వారి స్నేహితులు తెలిపారు. నది స్నానానికి వెళ్లగా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారన్నారు. గల్లంతైన వారి కోసం ఎస్ఐ శివాంజల్, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.