విశాఖపట్నంలో ఓ శ్మశానాన్ని అడ్డాగా చేసుకుని గంజాయి తరలిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను గోపాలపట్నం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 10.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన గోవర్ధన్, రూపేష్, కేరళకు చెందిన సజిత్ చంద్రన్ అనే నిందితులు అరకు, ఏజెన్సీ ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, తమ రాష్ట్రాల్లో అధిక ధరలకు అమ్ముకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.