AP: దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలను కూటమి ప్రభుత్వం పంపిణీ చేయనుంది. నియోజకవర్గానికి 10 మంది చొప్పున తొలి విడతగా 875 మందికి హీరో వాహనాలను పంపిణీ చేయనున్నారు. డిగ్రీ, ఆపై విద్య అభ్యసించే విద్యార్థులు అర్హులు. కనీసం ఏడాదికి పైగా స్వయం ఉపాధి రంగంలో ఉన్న వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. 70 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు. 18-45 ఏళ్లు ఉండాలి. ఆదాయ పరిమితి రూ.3 లక్షలు లోపు ఉండాలి.