AP: కర్నూలు జిల్లా ఆదోనిలో ముగ్గురు వైసీపీ ఎంపీటీసీలు అదృశ్యమయ్యారు. బైచిగేరి వైసీపీ ఎంపీటీసీ నాగభూషణ్ రెడ్డి గత మూడు రోజులుగా కనిపించడం లేదని ఆయన భార్య విజయలక్ష్మి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీజేపీ నాయకులు కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించారు. మరో ఇద్దరు ఎంపీటీసీల ఆచూకీపై సస్పెన్స్ నెలకొంది. బుధవారం ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ఉండటంతో ఎంపీటీసీలు కనపడకుండా పోవడం సంచలనంగా మారింది.