AP: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జంఝావతి రబ్బరు డ్యామ్‌లో ఈతకు వెళ్లిన శివిని గ్రామానికి చెందిన శరత్, గోవింద్‌నాయుడు, ప్రదీప్ అనే ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. డ్యామ్‌లో పడిపోతున్న బాలుడిని రక్షించే క్రమంలో వీరు నీటిలో కొట్టుకుపోయారు. పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిది కొమరాడ మండలం సివిని గ్రామం. వారు విహారయాత్రకు డ్యామ్‌కు వచ్చినట్లు సమాచారం.