వ్యక్తిని రాయితో కొట్టి చంపిన దుండగులు

AP: పల్నాడు జిల్లా, నరసరావుపేటలో మంగళవారం దారుణ ఘటన జరిగింది. దాసి రాజేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని పెద్దచెరువు వాసి అయిన రాజేష్‌ను గుర్తు తెలియని దుండగులు రాయితో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. హంతకులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕