నిన్న ధర్మవరం పట్టణంలో ఐడీఎఫ్ సీ బ్యాంకు ఏటీఎంను బోలేరో వాహనంతో లాగి, అందులోని సుమారు రూ.10 లక్షల నగదును దుండగులు అపహరించారు. డబ్బును తీసుకున్న తర్వాత, వారు రాప్తాడు మండలం హంపాపురం వద్ద ఏటీఎం మెషీన్‌ను పడేసి పారిపోయారు. ప్రస్తుతం పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.