రాబోయే 3 గంటల్లో పిడుగుల వాన.. ఆరెంజ్ అలర్ట్

AP: రాబోయే 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఈ మేరకు నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్

✕
✕