ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ కేంద్రం వెల్లడించింది. ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 40-60 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. రాయలసీమ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న రెండు రోజులు వాతావరణంలో మార్పులుంటాయని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్