AP: వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాల తర్వాత ఏపీలో మళ్లీ వర్ష సూచన వెలువడింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో సోమవారం పలు జిల్లాల్లో వర్షాలు, ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.