ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి (D) చిట్టమూరులో 88.5mm, చింతవరంలో 81mm, నెల్లూరులో 61mm, పాలూరులో 60mm వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.