14 లేగదూడలను చంపిన పెద్దపులి (వీడియో)

AP: పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలంలో పాత గంగంపాలెం సమీపంలో రాత్రిపూట దాడి చేసిన పులి 14 లేగదూడలను చంపింది. ఇటీవల రాజవొమ్మంగి మండలంలో 7 మూగజీవులపై దాడి చేసిన పులి, గంగవరం మండల పరిసరాల్లో 3 రోజులు సంచరించినట్లు సమాచారం. వారం గడవకముందే దేవీపట్నం మండలంలో మరోసారి దాడి చేయడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్