ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఆగస్టు 18 నుంచి పది రోజుల వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఆగస్టులో అమలు చేయనున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కొన్ని బిల్లులకు అసెంబ్లీలో ఆమోదం తెలపనున్నారని సమాచారం. అలాగే, అమరావతి రాజధానిపై ప్రత్యేక చర్చ ఉండనున్నట్లు టాక్.

సంబంధిత పోస్ట్