స్వార్థ రాజకీయాలకు తిరుమలను వేదికగా మార్చారు: జగన్

సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఎక్స్ వేదికగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తిరుమలను స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేసినా చంద్రబాబు చర్యలు తీసుకోలేదని, అతడినే పదవిలో కొనసాగించి ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీశారని విమర్శించారు. లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరిపై నెట్టారని, నెయ్యి సరఫరాను ఇందాపూర్‌ డెయిరీకి కట్టబెట్టి స్కామ్‌లు చేస్తూ సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారని జగన్ ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్