తిరుమల లడ్డూకు GI గుర్తింపు

AP: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల లడ్డూకు భారత ప్రభుత్వం భౌగోళిక సూచిక గుర్తింపును మంజూరు చేసింది. లడ్డూ తయారీ, విక్రయాలకు సంబంధించి టీటీడీకి FSSAI లైసెన్స్ కూడా లభించింది. దీంతో శ్రీవారి లడ్డూ నాణ్యత, ప్రామాణికత మరింత బలపడింది. అత్యాధునిక ఏఐ ఆధారిత కలర్ సార్టింగ్ యంత్రాలతో ముడి పదార్థాల నాణ్యతను మెరుగుపరుస్తున్నారు. 1950, 1951 నాటి సంప్రదాయ 'దిట్టం' ప్రమాణాలనే పాటిస్తూ, 700 మంది శ్రీవైష్ణవ బ్రాహ్మణులు 24 గంటలూ లడ్డూల తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఇటీవల లడ్డూ నాణ్యత, రుచి మెరుగుపడటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్