రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

చంద్రగిరి మండలం కల్ రోడ్డుపల్లి రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. రైల్వే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. మృతుడు 50 సంవత్సరాల వయసు కలిగి వైట్ షర్ట్, బ్లాక్ పాయింట్ ధరించి ఉన్నాడు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానికులు తెలియజేశారు. పాకాల రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్