తుడా నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలను వైసీపీ చంద్రగిరి ఇన్‌చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆదివారం ఖండించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని రాజకీయ కక్షతో తనపై, తన కుటుంబ సభ్యులపై అవాస్తవ ప్రచారం చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. తమ హయాంలో తుడా బడ్జెట్‌ను రూ. 29 కోట్ల నుంచి రూ. 400 కోట్లకు పెంచి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో భారీ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. తుడా నిధుల వినియోగంపై ఏసీబీ విచారణ కొనసాగుతున్నందున ఇప్పటివరకు సంయమనం పాటించామని, తమ కుటుంబంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ, విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.