చంద్రగిరి: మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిపై దాడి

మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిపై దాడి శనివారం కలకలం రేపింది. జేమ్స్ అనే విద్యార్థిని కిడ్నాప్ చేసి దుండగులు దాడి చేసారు. కులం పేరుతో దూషిస్తూ అవమానిస్తున్న తన జూనియర్ యశ్వంత్ ను ఇటీవల జేమ్స్ మందలించాడు.
యశ్వంత్ తో పాటు కొందరు రౌడీ షీటర్లు కూడా తనపై దాడి చేశారని జేమ్స్ తెలిపారు. సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పెట్టిన జేమ్స్. తనను రెండు రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్