చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో మంచు ఫ్యామిలీపై శుక్రవారం రెండు కేసులు నమోదయ్యాయి. 15వ తేదీ ఎంబీయూ డెయిరీ ఫార్మ్ గేటు వద్ద జరిగిన ఘటనతో ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మోహన్ బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికలతో పాటు మరో ముగ్గురుపై కేసులు నమోదయ్యాయి. తనపై, తన భార్య మౌనికపై దాడికి పాల్పడ్డారని మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబు పీఏలతో పాటు ఎంబీయూ సిబ్బంది 8మందిపై కేసులు నమోదయ్యాయి.