చంద్రగిరి: తిరుచానూరులో కానిస్టేబుల్ నిజాయతీ

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో చెన్నైకి చెందిన భక్తుడు తులసి దాస్ మహాద్వారం వద్ద మర్చిపోయిన నగదు బ్యాగును ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రమేశ్ నిజాయితీగా తిరిగి అప్పగించారు. బ్యాగులో రూ. 18,500 నగదుతో పాటు ఇతర వస్తువులున్నాయి. గుర్తింపు కార్డుల ఆధారంగా భక్తుడిని గుర్తించి, బ్యాగును సురక్షితంగా అప్పగించడంతో కానిస్టేబుల్ నిజాయితీని భక్తులు, అధికారులు అభినందించారు.

సంబంధిత పోస్ట్