పులిచెర్ల మండలం కొమ్మిరెడ్డిగారి పల్లెలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎదుట సోమవారం రైతులు, డ్వాక్రా మహిళలు, ఖాతాదారులు ధర్నా నిర్వహించారు. బ్యాంకు మేనేజర్ పంట రుణాల పునరుద్ధరణలో జాప్యం చేస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రుణాల కోసం వచ్చే డ్వాక్రా మహిళలను రోజుల తరబడి తిప్పిపెడుతున్నారని వారు ఆరోపించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.