చంద్రగిరికి చెందిన యువతి, రాయలపురానికి చెందిన దయాసాగర్ ప్రేమించి ఈనెల 11న కైలాసకోనలో వివాహం చేసుకున్నారు. అనంతరం ప్రాణ భయంతో ఇద్దరూ పోలీసులను ఆశ్రయించారు. కాగా, తల్లికి ఆరోగ్యం బాగాలేదని యువతిని ఆమె తండ్రి ఇంటికి తీసుకెళ్లాడు. రెండు గంటల్లో తిరిగి పంపిస్తామని చెప్పినా, నాలుగు రోజులైనా ఆమె తిరిగిరాలేదు. దీంతో భర్త దయాసాగర్ ఆదివారం చంద్రగిరి పోలీసులను మళ్లీ ఆశ్రయించి న్యాయం చేయాలని కోరాడు.