చంద్రగిరి: బస్సు చక్రం కింద పడి లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

శుక్రవారం సాయంత్రం పాకాల మండలం దామలచెరువు మ్యాంగోనగర్ కూడలిలో జరిగిన ఘోర ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం క్షేత్రేయగూడెంకు చెందిన లారీ డ్రైవర్ నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. బస్సు ఎక్కే క్రమంలో అతను పట్టుతప్పి కిందపడగా, బస్సు చక్రం అతని కాలుపైకి ఎక్కింది. స్థానికులు వెంటనే అతన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్