తిరుపతి రూరల్ మండల పరిధిలోని పేరూరు వకుళమాత ఆలయం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిని దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఒక వ్యక్తిని ఢీకొట్టింది. ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు గాంధీపురం, పేరూరు పంచాయతీకి చెందిన చెంచయ్యగా గుర్తించారు. కేసును ఎంఆర్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.