చంద్రగిరి మండలం ఎం. కొంగరవారిపల్లెలో 2024 జనవరిలో ఆరేళ్ల బాలికపై లైంగికదాడి చేసి హత్య చేసిన కేసులో 17 నెలల తర్వాత నిందితుడు బాల్ కిషోర్ ఖెర్వారు అరెస్ట్ అయ్యాడు. జార్ఖండ్ నుంచి ఇటుక బట్టీకి వచ్చిన వలస కార్మికుడైన అతడు చిన్నారిని మాయమాటలు చెప్పి అటవీప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ ప్రసాద్ గురువారం వెల్లడించారు.