తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం కాలనీకి చెందిన శ్రీవాణి ఓ ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపాల్ గా, ఆమె భర్త రవీంద్రనాథ్ ఎల్ఐసి ఉద్యోగిగా పనిచేస్తున్నారు. భర్త అనారోగ్యం నేపథ్యంలో సెలవు కావాలని కోరగా, పరీక్షల సమయమని యాజమాన్యం సెలవు ఇవ్వలేదు. ఆమె స్కూల్ కి వెళ్లకుండా ఆగిపోవడంతో కొత్త ప్రిన్సిపాల్ ను నియమించారు. మనస్తాపానికి గురైన శ్రీవాణి మంగళవారం ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయారు. భర్త ఫిర్యాదుతో కేసు నమోదైంది.