చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. భారతి నగర్‌కు చెందిన హర్షిణి (32) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. 9ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన నవీన్‌తో ఆమెకు వివాహమైంది. పిల్లలు లేరనే మనోవేదనతో ఆమె ఉరేసుకుని ప్రాణాలు విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.