చంద్రగిరి: మహిళ ఉరివేసుకొని మృతి

రామచంద్రాపురం రాయలచెరువు కట్టపై ముళ్లపొదల్లో సుమారు 50ఏళ్ల వయసు గల మహిళ ఉరివేసుకొని మృతి చెందినట్లు స్థానికులు గుర్తించి బుధవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎస్సై రామాంజనేయులు మాట్లాడుతూ. మహిళ పచ్చ రంగు చీర, ఎరుపు జాకెట్ ధరించి తల వెంట్రుకలు నరిచిపోయి ఉన్నాయన్నారు. ఎవరైనా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలన్నారు.

సంబంధిత పోస్ట్