తుమ్మలగుంట కళ్యాణవెంటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై శ్రీరామునిగా భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రగిరి మండలంలోని వివిధ పంచాయతీల నుంచి భక్తులు సారె తీసుకువచ్చి మొక్కులు తీర్చుకున్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భక్తులకు స్వాగతం పలికారు. వాహన సేవల్లో కళాకారులు, భజన బృందాలు ఆకట్టుకున్నాయి. సారె తెచ్చిన భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించారు.