అగరాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

చంద్రగిరి మండలం అగరాల సమీపంలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. చిత్తూరు నుంచి తిరుపతి వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన ఐచర్ వాహనం ఢీకొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోగా, ఆగి ఉన్న లారీని మరో రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ రెండో ప్రమాదంలో మరో డ్రైవర్ గాయపడ్డాడు. క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్