చంద్రగిరి బ్రాహ్మణ వీధిలో అర్ధరాత్రి హోంగార్డు రవిప్రకాశ్ బైక్‌ను దుండగులు తగలబెట్టారు. కుమార్తె అలికిడితో బయటకు వచ్చి తండ్రికి సమాచారం అందించింది. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే బైక్ పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై హోంగార్డు పోలీసులకు ఫిర్యాదు చేసి, నిందితులను గుర్తించి న్యాయం చేయాలని కోరారు.