చంద్రగిరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

చంద్రగిరి మండలం పనపాకం జాతీయ రహదారి సర్వీసు రోడ్డులోని శ్రీవిరూపాక్షమ్మ ఆలయం వెనుక మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరుపతికి తరలించారు.

సంబంధిత పోస్ట్