ఎమ్మెల్యే పులివర్తి నానిపై వైయస్ఆర్సీపీ ఫిర్యాదు

తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ భూకబ్జా వ్యవహారంలో ఎమ్మెల్యే పులివర్తి నాని, చంద్రగిరి మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైయస్ఆర్సీపీ తీవ్రంగా స్పందించింది. తిరుపతి రూరల్ మండల వైసిపి నాయకులు ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ లో పులివర్తి నానిపై గురువారం ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే నానిని వెంటనే అరెస్టు చేయాలని వైసిపి డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో విడుదల మాధవ రెడ్డి, చిన్ని యాదవ్, కేశవ, వెంకటరమణ, లక్ష్మిరాజా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్