చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించి, బెదిరించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. గురువారం ఈ సంఘటనపై తిరుపతి రూరల్ పీఎస్‌లో వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వెలుగు చూసిన ఫోన్ సంభాషణలో ప్రజాప్రతినిధికి తగని భాష వాడటం శాంతిభద్రతలకు విఘాతమని పేర్కొన్నారు. ఆడియో ఆధారాలు, కాల్ రికార్డులను పరిశీలించి ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విడుదల మాధవ రెడ్డి, చెంచు మోహన్ యాదవ్, మొక్కల భారతి, మల్లారపు వాసు తదితరులు పాల్గొన్నారు.