చిత్తూరులోని చన్నసముద్రం గ్రామంలో 2018లో జరిగిన ద్విహత్య కేసులో నిందితుడు పండి కేశవులుకు 9వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. తన కుమార్తెను శేఖర్ లైంగికంగా వేధిస్తున్నాడనే కక్షతో అతడిని హత్య చేసిన కేశవులు, విషయం బయటకు చెప్పకుండా ఉండేందుకు లక్ష్మీపతిని కూడా హత్య చేసినట్లు విచారణలో తేలింది. మృతుడు శేఖర్ తల్లి మాణిక్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా, కోర్టు నిందితుడికి రెండు హత్యలకు జీవిత ఖైదుతో పాటు ఒక్కో హత్యకు రూ.1,000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.