సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ తుషార్ డూడి

చిత్తూరు జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంగళవారం జిల్లా ఎస్పీ తుషార్ డూడి సూచించారు. 2025 సెప్టెంబర్ 16 నుంచి 2026 సెప్టెంబర్ 15 వరకు NCRP ద్వారా 1,608 ఫిర్యాదులు నమోదుకాగా, రూ. 4.01 కోట్లకు పైగా నగదును హోల్డ్ చేసి, రూ. 2.15 కోట్లకు పైగా బాధితులకు రీఫండ్ చేసినట్లు తెలిపారు. సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు కాల్ చేయాలని, www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. OTP, PIN, CVV వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని ఎస్పీ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕