డ్రోన్ సాయంతో రెండు గంటల్లో బాలుడి ఆచూకీ

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం నలగంపల్లిలో ఇంటి నుంచి వెళ్లిపోయిన 12 ఏళ్ల బాలుడిని పోలీసులు డ్రోన్ సాయంతో రెండు గంటల్లో గుర్తించి మంగళవారం తల్లిదండ్రులకు అప్పగించారు. కుటుంబంతో గొడవపడి వెళ్ళిపోయిన బాలుడి ఆచూకీ కోసం తండ్రి ఫిర్యాదు చేయగా, ఎస్ఐ శ్రీనివాసులు డ్రోన్ ద్వారా గాలింపు చేపట్టి అతన్ని సురక్షితంగా కనుగొన్నారు. పోలీసుల ఈ తక్షణ స్పందనను జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు.

సంబంధిత పోస్ట్

✕
✕