మూడు రోజుల క్రితం చిత్తూరు బ్యాన్స్ హోటల్ సమీపంలో కుటుంబ సభ్యులతో ద్విచక్ర వాహనంతో వెళ్తున్న సమయంలో లారీ ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ ఘటన అందరికీ తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేష్ రెండు రోజుల క్రితం స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత రాత్రి రాణిపేట సిఎంసిలో చికిత్స పొందుతున్న పూర్ణిమ మరణించింది. తల్లిదండ్రులు మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాధలు అయ్యారు.