ఈ నెల 4వ తేదీన చిత్తూరు పట్టణంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ ఆదివారం తెలిపారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ నిందితుడిని అరెస్టు చేసి సుమారు 12 లక్షల విలువచేసే 131.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 లక్షలు విలువచేసే 2.57 కేజీల వెండి, రెండు లక్షల విలువచేసే ఒక కారును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.