చిత్తూరు: లోన్ కట్టకపోవడంతో నా భార్యను నిర్బంధించారు

అప్పు చెల్లించలేదని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లు గర్భవతి అయిన తన భార్య యువరాణిని అక్రమంగా నిర్బంధించారని గంగాధర నెల్లూరు మండలం అక్కన్నగారిపల్లికి చెందిన భరత్ కుమార్ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. 2023లో ప్రైవేట్ కంపెనీ నుంచి రూ. 1. 50 లక్షలు రుణం తీసుకున్నానన్నారు. అనారోగ్యం కారణంగా కొన్ని నెలలుగా వడ్డీ చెల్లించలేదని తెలిపారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్