చిత్తూరు: మద్యం మత్తులో తహసీల్దార్ల దాడి

చిత్తూరులో సోమవారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించిన ఇద్దరు ఇన్‌ఛార్జి తహసీల్దార్లు వీధిరౌడీల్లా ప్రవర్తించి దారిన పోయేవారిని భయపెట్టారు. నగరంలోని ప్రభా గ్రాండ్‌ హోటల్‌ ఎదురుగా మెయిన్‌ రోడ్డుపై కృష్ణకుమార్‌ అనే వ్యక్తి మీద దాడి చేసి బండ బూతులు తిట్టారు. ఈ దాడిలో అతడికి గాయాలయ్యాయి. కృష్ణకుమార్‌ పలమనేరు ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు తహసీల్దార్లతో కలిసి హోటల్‌లో మద్యం సేవించి, ఆ సందర్భంగా మాటామాట పెరిగి ఇలా దాడి చేశారనే చర్చ నడుస్తోంది.

సంబంధిత పోస్ట్