చిత్తూరు నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు ఉదయం 3 గంటల ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రం హోసకోట సమీపంలో ప్రమాదానికి గురైంది. లారీ-బస్సు ఢీకొన్నట్లుగా స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతులు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.