చిత్తూరు జిల్లా పోలీసుల ఘన సన్మానం: 9 మందికి వీడ్కోలు

30 జూన్ 2026న చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో, పదవీ విరమణ పొందిన 9 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి స్థానిక పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాలులో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, నాన్ కేడర్ ఎస్పీ (అడ్మిన్) ఎస్.ఆర్. రాజశేఖర రాజు, ఏఆర్ అదనపు ఎస్పీ దేవదాస్, అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) ఎస్. షాను జ్ఞాపికలు, బహుమతులు అందించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. పదవీ విరమణ పొందిన సిబ్బంది దశాబ్దాల పాటు నిబద్ధతతో అందించిన సేవలు శాఖకు గర్వకారణమని, వారి క్రమశిక్షణ, సేవా తత్వం యువ పోలీసులకు ఆదర్శంగా నిలుస్తాయని అధికారులు కొనియాడారు.

సంబంధిత పోస్ట్