ద్వంద్వ హత్య కేసు: బండి కేశవులుకు జీవిత ఖైదు

2018లో చిత్తూరు జిల్లాలో జరిగిన ద్వంద్వ హత్యల కేసులో నిందితుడు బండి కేశవులుకు చిత్తూరులోని 9వ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. రెండు హత్యలకు గాను జీవిత ఖైదుతో పాటు ఒక్కో హత్యకు రూ.1,000 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS అభినందించారు.

సంబంధిత పోస్ట్