చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS ఆదేశాల మేరకు బంగారుపాళ్యం మండలం బి.ఎల్. కండ్రిగ సమీపంలో డ్రోన్ నిఘా ఆధారంగా పోలీసులు అక్రమ జూద స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఏడుగురు జూదరులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.32,200 నగదు మరియు 52 ప్లేయింగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను గమనించిన ముగ్గురు నిందితులు పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసును A.P. Gaming Act కింద నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. అక్రమ జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు కనిపిస్తే వెంటనే డయల్ 112 చేసి తెలపాలన్నారు.