చిత్తూరులో కుటుంబ సభ్యులతో మనస్పర్థల కారణంగా ఇంటి నుంచి వచ్చిన మదనపల్లెకు చెందిన యువతికి మహిళా పోలీసులు శనివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎస్ఐ కరీమునిషా ఆధ్వర్యంలో తల్లీకూతుళ్లకు అవగాహన కల్పించి, అనంతరం యువతిని తల్లి దేవితో కలిసి సురక్షితంగా మదనపల్లెకు పంపించారు. మహిళా పోలీసుల సేవలను ఎస్పీ తుషార్ డూడి, IPS అభినందించారు.