మొగిలీశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యుడిగా ఎల్. సంజీవి నియామకం

పూతలపట్టు నియోజకవర్గం బీజేపీ పార్టీ కార్యాలయంలో BJYM జిల్లా అధ్యక్షులు L. భాను ప్రకాష్ మాట్లాడుతూ, బంగారుపాళ్యం మండలం వెంకటగిరి చెందిన ప్రముఖ విద్యావేత్త, రిటైర్డ్ హెడ్ మాస్టర్ L. సంజీవి (M. Com, B. Ed) శ్రీ కామాక్షి దేవి సమేత మొగిలీశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి మరియు పునర్నిర్మాణ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు మొగిలీశ్వర స్వామి ఆలయ ఆవరణంలో ప్రమాణస్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి భక్తులు, గ్రామ పెద్దలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕